Saturday, 13 June 2026 04:03:36 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

సునీతకి సుప్రీంకోర్ట్ జలక్,వై ఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు రెండు నెలలు పొడిగింపు,

Date : 24 April 2023 10:34 PM Views : 977

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విజయవాడ : వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు రెండు నెలలు పొడిగింపు Supreme court : వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం నిలిపేసింది. హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టిన సుప్రీంకోర్టు.. అలాంటి ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించింది. నిందితులకు లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం అసమంజసమని పేర్కొంటూనే.. సీబీఐకి నిబంధనలు విధించడం సరైన చర్య కాదని సుప్రీం స్పష్టం చేసింది. సీబీఐ సిట్ ఏర్పాటు సందర్భంగా ఏప్రిల్ 30లోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు.. తాజా పరిణామాల నేపథ్యంలో సీబీఐకి మరో రెండు నెలల గడువు ఇచ్చింది. సుప్రీంలో సవాల్ చేసిన సునీత... కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 24 వరకు అరెస్టు చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ... వైఎస్ వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా సునీత తరఫున, ముకుల్‌ రోహత్గీ అవినాష్‌ రెడ్డి తరఫున వాదించారు. బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి... 'అందరి వాదనలు విన్నాం.. అఫిడవిట్లు, రిమాండ్‌ రిపోర్టులను పరిశీలించాం..' అన్న సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్‌ను అవినాష్‌ ఉపసంహరించుకోవాలని, ముందస్తు బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. హత్య కేసులుసాక్ష్యాలను నాశనం చేసేందుకు అవినాష్‌ రెడ్డి యత్నించాడని ఈ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదించారు. సీఐ శంకరయ్య తన వాంగ్మూలంలో అదే చెప్పారన్న న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. అవినాష్‌కు ప్రశ్నలు ముందే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ హైకోర్టు ఇలా చెప్పడం గతంలో ఎప్పుడూ లేదని వెల్లడించారు. దీనిని ఖండించిన అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. సీబీఐ పని హైకోర్టు చేస్తే ఎలా.. వాదనలు ముగిసిన అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఆర్డర్ కాపీని చదివారు. హత్య కేసులో అవినాష్‌ పాత్ర ఉందని సీబీఐ స్పష్టంగా చెప్పిందన్న సీజేఐ.. విచారణ ఇంకా ప్రాథమిక దశలో ఉన్న కేసుపై హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. సీబీఐ పని కూడా తెలంగాణ హైకోర్టు చేస్తే ఎలా? అని సీజేఐ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. నిందితులకు లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం అసమంజసమని.. ఈ ఆదేశాలు సీబీఐ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. కాగా, ఈ కేసుపై రేపు హైకోర్టులో విచారణ ఉందని తెలిపిన అవినాష్‌ తరఫు న్యాయవాదులు, అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని కోరారు. అయితే, అలాంటి ఆదేశాలను ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు.. మీ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయని స్పష్టం చేసింది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :