విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విజయవాడ : ‘బడ్జెట్‘ దీని గురుంచి వార్తలు రాసేవారికి, వ్యాపారస్తులకు తప్ప మిగిలిన ప్రజానీకానికి అనవసరం. ప్రయోజనాలు ఉన్నా అర్థం కాని పరిభాషలో ఉంటుంది కనుక అనవసరం అన్నట్లుగా భావిస్తారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కోటి ఆశలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘కేంద్ర బడ్జెట్ 2023-24‘ను ప్రవేశపెట్టారు. ఇందులో వేతన జీవులకు వరాలు(ఏడు లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు), మహిళల కోసం ప్రత్యేక పథకం(మహిళా సమ్మాన్ పొదుపు పథకం), పాన్ కార్డుకు జాతీయ కార్డుగా గుర్తింపు, రైల్వేల అభివృద్ధికి రూ.2.4 లక్షల కోట్లు, విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించడం.. వంటి హైలైట్స్ ఉన్నాయి.అలాగే, కొన్ని దిగుమతి తీసుకునే వస్తువుల సుంకాలపై రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేశారు. పలితంగా కొన్ని వస్తువులు ధరలు తగ్గనుండగా… మరికొన్ని వస్తువులు ఖరీదైనవిగా మారనున్నాయి. బడ్జెట్ -2023 కారణంగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి..? ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయి..? అన్నది ఓసారి తెలుసుకోండి..
ధరలు పెరిగే వస్తువులు ::::::సిగరెట్‌పై పన్నును 16 శాతానికి పెంచారు. దీంతో సిగరెట్ ధర మరింత పెరగనుంది.... బంగారం, వెండి, ప్లాటినం వస్తువులపై పన్ను పెరుగనుంది. దీని వల్ల వీటి ధరలు మరింత ప్రియం కానున్నాయి. దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలపై పన్నును 7.5 నుంచి 15 శాతానికి పెంచారు. దీంతో వీటి రేట్లు పెరగనున్నాయి...... రబ్బర్ పై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. పలితంగా రబ్బర్ తో తయారుచేసే టైర్లు, చెప్పులు వంటి వాటి ధరలు పెరగనున్నాయి..................... బ్రాండెడ్ వస్తువులు ధరలు కూడా మరింత ప్రియం కానున్నాయి.
..ధరలు తగ్గించే వస్తువులు..... ఎలక్ట్రిక్ వాహనాల రంగాలకు మరింత ఉత్తేజాన్నిచ్చారు. దీంతో ఎలక్ట్రిక్ కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయి............... కెమెరా లెన్స్, లిథియం ఆయన్ బ్యాటరీ వంటి మొబైల్ ఫోన్లు, కెమెరాలలో ఉపయోగించే ఉపకరణాలపై కస్టమ్ సుంకాన్ని తగ్గించారు. ఫలితంగా వీటి ధరలు తగ్గనున్నాయి......... టెలివిజన్ ప్యానల్‌లో బిగించే సెల్‌లో ఉండే కొన్ని భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని 5శాతం నుండి 2.5శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.... ల్యాబ్‌లలో తయారు చేసే.. అంటే కృత్రిమంగా తయారుచేసే డైమండ్లపై కస్టమ్ సుంకం తక్కువగా ఉంటుంది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి........ క్రూడ్ గ్లిజరిన్‌పై ఉండే పన్నును 7.5 నుంచి 2.5కు తగ్గించారు. అలాగే, డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాల్‌కు పన్ను నుంచి విముక్తి కల్పించారు.
Admin
Viswas Tv