Tuesday, 14 April 2026 11:24:20 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

Suger*డయాబెటీస్ ఉన్న పేషెంట్లు మందు తాగితే ఎంత డేంజరో తెలుసా?

Date : 26 December 2022 12:12 AM Views : 717

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ ను ఇష్టమొచ్చినట్టుగా తాగుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు మందును మొత్తమే తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహులు..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు, క్రిస్మస్ సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా మందు కొడుతుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ మందు పార్టీల వల్ల ఆనందానికి అవదులు ఉండవేమో.. కానీ దీనివల్ల ఆరోగ్యం మాత్రం పక్కాగా దెబ్బతింటుంది. అవును అతిగా మందు కొట్టడం వల్ల శరీర పనితీరు బాగా దెబ్బతింటుంది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆల్కహాల్ ను మొత్తమే తాగకూడదు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు. మధుమేహులకు ఆల్కహాల్ చాలా ప్రమాదకరం. దీనివల్ల వీరి రక్తంలో చక్కెర స్థాయిల బాగా పెరిగిపోతాయి. అంతేకాదు మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఆల్కహాల్ ఎందుకు ప్రమాదకరం? అప్పుడప్పుడు మందు తాగడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. ఇది ఆనందాన్ని కూడా ఇస్తుంది. కానీ దీన్ని రోజూ లేదా తరచుగా తాగితే మాత్రం పాణానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆల్కహాల్లో పిండి పదార్ధాలు, చక్కెరలు ఉంటాయి. అందుకే ఆల్కహాల్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో మద్యాన్ని తాగడం వల్ల డయాబెటిస్ పేషెంట్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పార్టీలకు మందును తాగాలనుకుంటే మాత్రం ఒకసారి డాక్టర్ ను ఖచ్చితంగా సంప్రదించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు డయాబెటిస్ పేషెండ్లు ఆల్కహాల్ ను అతిగా తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇది డయాబెటిస్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్యాన్ని అతిగా తాగడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే వికారం, ఆకలి పెరగడం, కంటిచూపు మసకబారడం, మాటల్లో తత్తరపాటు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది దీర్ఘకాలిక సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.... ఆల్కహాల్, డయాబెటిస్ మధ్య సంబంధం ఏంటి ఆల్కహాల్ ను తాగడం తప్పేం కాదు. కానీ ఒకే సారి ఎక్కువ మొత్తంలో తాగితే మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. అయినప్పటికీ మీ వైద్యుడి ఒకసారి ఆల్కహాల్ గురించి అడగడం మంచిది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు, మీరు తీసుకునే మందులు వంటి వాటిని తెలుసుకుని ఆల్కహాల్ ను తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మొత్తమే తాగకుండా ఉండాల్సి వస్తుంది.మద్యం తాగే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు మందును తాగే ముందు కార్బోహైడ్రేట్లు ఉండే తేలికపాటి భోజనం చేయండి. ఇది రక్తంలో ఆల్కహాల్ శోషణ రేటును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు మధుమేహం ఉన్నట్టైతే.. అప్పుడు డయాబెటిస్ ఐడిని తీసుకెళ్లండి. లేదా డయాబెటిస్ ఐడి రిస్ట్ బ్యాండ్ ను ధరించండి. దీనివల్ల మీ మధుమేహ పరిస్థితి గురించి ఇతరులు తెలుసుకుంటారు. అవసరమైనప్పుడు తక్షణ సాయం కూడా పొందొచ్చు. పడుకునే ముందు, మరుసటి రోజు నిద్రలేచిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ ను తనిఖీ చేయండి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉంటే ఏదైనా తినండి. మద్యం సేవించిన మరుసటి రోజు పుష్కలంగా నీటిని తాగండి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :