Saturday, 13 June 2026 04:04:00 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

అక్ర మార్జినని సమర్ధించడాన్ని మించిన దేశ ద్రోహo ఉందా !!!

Date : 29 January 2023 01:13 PM Views : 948

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : అక్రమార్జనని సమర్థించడాన్ని మించిన దేశ ద్రోహం ఉందా? మనదేశం ఎన్నో స్కాములు చూసింది..అయినా మన ఆర్ధిక వ్యవస్థ తట్టుకుని నిలబడింది.. కానీ, 'ఎవరు అవినీతి చేయలేదు' అంటూ ఆ స్కాములను సమర్థించడానికి తమ మేధస్సును ఉపయోగించే మేధావులు, బాబాలు,జర్నలిస్టుల వల్లే తీరని నష్టం జరుగుతోంది. (ఇదే మేధావులు అన్నాహజారే వెనకాల చేరి అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేసారు.) ఎదిగిన వాళ్ళంతా అడ్డదారుల్లో ఎదిగిన వారే అనే అభిప్రాయం ప్రజల్లో బలపడడం వల్ల,'ఏదో రకంగా డబ్బు సంపాదించడమే' జీవిత లక్ష్యం అయిపోతుంది. ఈజీ మనీ కోసం వెంపర్లాట పెరుగుతుంది. బలిసినవాళ్ళు వేలకోట్లు దోచుకుంటుంటే, మనం ఈ చిన్న దోపిడీ/మోసం చేయడం తప్పే కాదు అనే సమర్థన మొదలవుతుంది. లంచాలు తీసుకోవడం తప్పే కాదు అని ఉద్యోగులు భావిస్తుంటారు. కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు సూపర్ హిట్ అవడం..యువత ఆలోచనల్లో వచ్చిన మార్పుకి నిదర్శనం. ప్రజల్లో కష్టపడి ఎదగాలనే తపన, ఆలోచన తగ్గిపోతే, పరిశ్రమలు, వ్యాపారాలకు నమ్మకమైన నాణ్యమైన మానవవనరులు దొరక్క యంత్రాలపై ఆధారపడడం ఎక్కువ అవుతుంది. దీనితో నిరుద్యోగం పెరుగుతుంది.. నిరుద్యోగులని ఆదుకునే పేరుతో ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటిస్తాయి. ఈ ఉచితాల భారం నిజాయితీగా పన్ను చెల్లించే ఉద్యోగులు, వ్యాపారాలపై పడుతుంది. దానితో వ్యాపారులు విదేశీ కంపెనీలతో పోటీ పడే శక్తి కోల్పోతారు. ఇది మరింత నిరుద్యోగాన్ని పెంచుతుంది. ఇది ఒక విషవలయంలా కొనసాగుతూనే ఉంటుంది. అమెరికాలో కార్పోరేట్ మోసాలు లేవా, అమెరికా ఎదగలేదా..అని ప్రశ్నించేవాళ్ళు గుర్తించాల్సింది ఏమిటంటే..అమెరికాలో ఒక మోసం బయటపడితే ఎంత పెద్ద పలుకుబడి ఉన్నవారికైనా శిక్ష తప్పదు అనే భయం ఉంటుంది. అంటే, అమెరికాలో 'రూల్ ఆఫ్ లా' మన కన్నా ఎన్నో రెట్లు మెరుగు. (అక్కడ కూడా కొందరు తప్పించుకోవచ్చు). సో, అవినీతిపరుడి కన్నా, ఆ అవినీతిని సమర్థించేవారు దేశానికి ఎక్కువ ద్రోహం చేస్తున్నట్లు. మతం కోసమో, కులం కోసమో, పార్టీ కోసమో, అవినీతిని సమర్థించేవారిని మించిన దేశద్రోహులు ఎవరూ ఉండరు. నరిష్ శిరోమణి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :