Tuesday, 14 April 2026 11:22:07 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. చిన్నపిల్లలే టార్గెట్‌.NO1!

Date : 25 December 2023 08:51 PM Views : 1013

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి కొత్త రూపం సంతరించుకొని ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఇటు భారత్‌లోనూ కరోనా కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరింది.

కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి కొత్త రూపం సంతరించుకొని ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఇటు భారత్‌లోనూ కరోనా కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరింది. తెలంగాణలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు.

వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు.. టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్ కు పంపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తితో అప్రమత్తమైన ఎంజీఎం హాస్పిటల్‌ సిబ్బంది మాస్క్‌ లేనిదే ఆస్పత్రిలోకి ఎవరినీ అనుమతించడంలేదు. సిద్ధిపేటలో కూడా ఒక కేసు నమోదయింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కొవిడ్ కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెపుతున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :