విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : Aghori లైఫ్: అఘోరీ అనగానే.. ఒంటిపై బట్టలు లేకుండా.. బూడిద రాసుకొని ఉండే వారే గుర్తొస్తారు. అఘోరీ అనే పదానికి సంస్కృత భాషలో 'వెలుగు వైపు' అని అర్థం. దీనితో పాటు, ఈ పదం.. స్వచ్ఛత, అన్ని చెడుల నుంచీ విముక్తి అనే అర్థాలను ఇస్తుంది. కానీ అఘోరీల జీవనశైలి, పద్ధతులు దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. అఘోరీల రహస్య ప్రపంచానికి సంబంధించిన కొన్ని విచిత్రమైన, నమ్మలేని నిజాలు తెలుసుకుందాం. 1. పచ్చి మానవ మాంసాన్ని తినడం : ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీల్లో చాలా మంది అఘోరీలు తాము పచ్చి మానవ మాంసాన్ని తింటామని అంగీకరించిన మాట నిజం. తరచుగా ఈ అఘోరీలు శ్మశాన వాటికల్లోనే నివసిస్తారు. సగం కాలిన మృతదేహాలను బయటకు తీస్తారు. ఆ మాంసాన్ని తింటారు. శరీర ద్రవాలను కూడా తాగుతారు. ఇలా చేయడం ద్వారా తంత్రం చేసే వారి శక్తి బలపడుతుందని వీరు నమ్ముతారు. సాధారణ ప్రజలు హేయమైనదిగా భావించే విషయాలు.. అఘోరీలకు తమ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం.2. శివుడు, శవ ఆరాధకులు : అఘోరీ తనను తాను పూర్తిగా శివునిలో ఐక్యం చేసుకోవాలనుకుంటాడు. శివుని ఐదు రూపాలలో అఘోర ఒకటి. శివుడిని ఆరాధించడానికి.. ఈ అఘోరీలు మృతదేహంపై కూర్చొని సాధన చేస్తారు. ఈ విధంగా 'మృతదేహం నుంచి శివుని పొందడం' అఘోర సంస్కారానికి సంకేతం. ఈ అఘోరీలు శవ సాధన అనే పేరుతో 3 రకాల సాధనలు చేస్తారు. అందులో భాగంగా మొదటిది మృత దేహానికి మాంసం, మద్యాన్ని సమర్పించడం. రెండోది మృతదేహంపై ఒంటికాలిపై నిలబడి శివుని ఆరాధించడం, మూడోది శ్మశాన వాటికలో సాధన. 3. మృతదేహంతో శారీరక సంబంధం : అఘోరీ సాధువులు సాధనతో పాటూ మృత దేహాలతో శారీరక సంబంధం పెట్టుకుంటారనేది ఒక ప్రసిద్ధ నమ్మకం. ఈ విషయాన్ని స్వయంగా ఓ అఘోరీ వివరించారు. శివుడినీ, శక్తినీ పూజించే విధానం ఇదేనని.. ఆయన వివరించారు. అధ్వాన్నమైనా భగవంతుని ఆరాధనకు, భక్తికి ఇదే సులువైన మార్గం అని ఆయన అంటున్నారు. మృతదేహంతో శారీరక శ్రమ చేసే సమయంలో కూడా మనసు భగవంతుని భక్తిలో నిమగ్నమైతే ఇంతకంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన ఏ స్థాయిలోనూ ఉండదని వారు నమ్ముతున్నారు.
4. జీవించి ఉన్నవారితోనూ భౌతిక సంబంధాలు : ఇతర సాధువుల వలీ, అఘోరీలు బ్రహ్మచర్యం పాటించరు. బదులుగా మంత్రాలు పలుకుతూ, మృతదేహంపై బూడిద చల్లి భౌతిక సంబంధం కొనసాగిస్తారు. శారీరక సంబంధం పెట్టుకునే ఈ చర్య సాధనలో ఒక భాగం. ముఖ్యంగా స్త్రీ రుతుక్రమం జరుగుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల అఘోరీల శక్తి పెరుగుతుందని అంటారు. ఇదే క్రమంలో వీరు జీవించి ఉన్న వారితోనూ సంబంధాలు పెట్టుకుంటారని చెబుతారు. 5. శివుని కారణంగా కపాలం వాడుతారు : మీరు అఘోరీల చిత్రాలను చూసినట్లయితే, వారితో ఎప్పుడూ మానవ పుర్రె ఉండటం గమనిస్తారు. అఘోరీలు మానవ పుర్రెలను ఆహార పాత్రలుగా ఉపయోగిస్తారు. అందుకే వాటిని 'కపాలం' అని పిలుస్తారు. శివుడి నుంచే ఈ స్ఫూర్తి పొందారనిని చెబుతారు. పురాణాల ప్రకారం.. ఒకసారి శివుడు బ్రహ్మతలను నరికి,.. ఆ తలను తీసుకుని విశ్వమంతా తిరిగాడట. శివుని ఈ రూపాన్ని అనుసరించే అఘోరీలు కపాలాన్ని కూడా తమతో ఉంచుకుంటారు.6. అఘోరీలు కుక్కలను మాత్రమే పెంచుకుంటారు : అఘోరీలకు కుక్కలంటే చాలా ఇష్టం. ఆవు, మేక వంటి అన్ని ఇతర జంతువులకూ దూరం ఉండే అఘోరిలు.. తన చుట్టూ కుక్కలను ఉంచుకోవడానికి ఇష్టపడతారు.
7.ప్రతి మనిషి అఘోరీ: ప్రతి వ్యక్తీ అఘోరీగానే జన్మిస్తాడని అఘోరీలు నమ్ముతారు. ఒక చిన్న పిల్లవాడు తన మలినానికీ, తిండికీ మధ్య తేడాను ఎలా అర్థం చేసుకోలేడో, అదేవిధంగా అఘోరీ కూడా మురికినీ, మంచితనాన్నీ ఒకే కళ్ళతో, ఒకేలా చూస్తాడని ఓ అఘోరీ తెలిపాడు. 8.ఎయిడ్స్, క్యాన్సర్‌కి నివారణ కలిగి ఉన్నారా? : చాలా మంది అఘోరీలు తాము ఎయిడ్స్, క్యాన్సర్‌కి నివారణ కలిగి ఉన్నామని చెబుతారు. దీనికి శాస్త్రీయ రుజువు లేనప్పటికీ, అఘోరీలు మృతదేహం నుంచి నూనెను తీయడం ద్వారా.. ఈ వ్యాధులకు నివారణను కనిపెట్టారని చెబుతుంటారు
Admin
Viswas Tv