Saturday, 13 June 2026 05:58:41 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

రంగంలోకి గులాబీ బాస్ -రేవంత్ రెడ్డికి చెక్ పెట్టె పనిలో బిజీ !

Date : 07 January 2024 12:39 AM Views : 1171

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలకంగా కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. తుంటికి సర్జరీ కారణంగా విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ మరి కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి రావాలని నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికలకు కేడర్ ను సంసిద్దులను చేసే బాధ్యతలు తీసుకుంటున్నారు. జిల్లాల పర్యటనలకు సిద్దమవుతున్నారు. ప్రతీ రోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు.

ప్రజల్లోకి కేసీఆర్ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహంతో ఉన్న కేడర్ లో జోష్ తెచ్చేందుకు తానే రంగంలోకి దిగాలని నిర్ణయించారు. అదే సమయంలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్, వ్యక్తిగతంగా కేసీఆర్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సస్ రేవంత్ నాయకత్వానికి పరీక్షగా మారనున్నాయి.

కేడర్ కు అందుబాటులో : కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మార్చి 17వ తేదీతో వంద రోజుల సమయం ముగియనుంది. పథకాల అమలు పైన ఒత్తిడి..తమ పాలన పైన చేస్తున్న విమర్శలకు ప్రజల మధ్య నుంచే సమాధానం చెప్పాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. కేసీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని పార్టీ ముఖ్యనేత హరీష్ వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు. ఫిబ్రవరి లో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని ప్రకటించారు. ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లపై కేసీఆర్‌ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు.రేవంత్ వర్సస్ కేసీఆర్ : బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దులు చేస్తూ వాయిదాలు వేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల పై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమం లో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదని చెప్పుకొచ్చారు.ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని హరీష్ వివరించారు. సత్తా ఏమిటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :