విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రాకాసి కరోనా corona షేక్ : తెలంగాణలో ఒమిక్రాన్ కొత్తవేరియంట్ తొలి కేసు .. దేశంలో పెరుగుతున్న ఎక్స్‌బీబీ 1.5 వైరస్ Corona Alert: లేదు...పోయింది..ఇక రాదు అనుకొని హ్యాపీగా జనం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇండియాలో కలకలం రేపుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసులు భారత్‌లోనే కాదు తెలంగాణలో కూడా గుబులు పుట్టిస్తోంది.లేదు...పోయింది..ఇక రాదు అనుకొని హ్యాపీగా జనం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇండియాలో కలకలం రేపుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసులు భారత్‌లోనే కాదు తెలంగాణలో కూడా గుబులు పుట్టిస్తోంది.
కరోనా వైరస్ జన్యు రూపం మార్చుకొని మానవాళిపై దండయాత్ర చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాలు భయంతో గజగజ వణికిపోతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎక్స్‌్బీబీ1.5 వేరియంట్ కేసులు కూడా చాప కింద నీరులా భారత్‌లో పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ కేసులు గుజరాత్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కర్నాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు నమోదైంది. తాజాగా తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లోనూ ఒక్కో కేసు నమోదు కావడం దడ పుట్టిస్తోంది.కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా ఏడుకు చేరిందని ఇన్పాకాగ్ వెల్లడించింది. ఈ వేరియంట్ కేసులు చైనా, అమెరికాలో విస్తృతంగా పెరుగుతున్నట్లుగా అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ కేసులు గుజరాత్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కర్నాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు నమోదైంది. తాజాగా తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లోనూ ఒక్కో కేసు నమోదు కావడం దడ పుట్టిస్తోంది.కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా ఏడుకు చేరిందని ఇన్పాకాగ్ వెల్లడించింది. ఈ వేరియంట్ కేసులు చైనా, అమెరికాలో విస్తృతంగా పెరుగుతున్నట్లుగా అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్ని గడగడలాడించిన కరోనా వైరస్ కొత్త సంవత్సరంలో కూడా కొత్త వేరియంట్ రూపంలో దాడి చేయడందతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కరోనా మార్గదర్శకాల్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది.బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వాడకం, అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఎయిర్‌పోర్ట్‌లతో కరోనా టెస్ట్‌లు తప్పని సరి చేసింది. దీనికి వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌తో పాటు కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే దేశంలోకి అనుమతించేలా చర్యలు చేపడుతోంది.ముక్కులోని రెండు రంద్రాల్లో ఒక్కో దాంట్లో నాలుగు చుక్కల చొప్పున వేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ నాసిల్ డ్రాప్స్ ధర 325రూపాయలుగా నిర్ణయించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 800రూపాయలకు అందుబాటులో ఉందికరోనా పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే వైద్య సేవలు, వ్యాక్సిన్ కంటే వ్యక్తిగత నియంత్రణ, శుభ్రత చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ విజృంభించకుండా చూసుకోవాల్సిన అందరిపైన ఉందంటున్నారు.
Admin
Viswas Tv