Tuesday, 14 April 2026 11:23:00 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పొరపాటున లూప్‌లైన్‌లోకి వెళ్లడం వల్లే ఈ పెను ప్రమాదం...

Date : 03 June 2023 06:08 PM Views : 1138

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : Odisha Train Accident : ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడించింది రైల్వే శాఖ. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పొరపాటున లూప్‌లైన్‌లోకి వెళ్లడం వల్లే ఈ పెను ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు అంచనాకు వచ్చారు. Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదం.. దేశం మొత్తాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటన.. ఎలా జరిగిందన్న దానిపై కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే, సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడం వల్లే.. ఈ పెను ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది రైల్వే శాఖ. సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆ నివేదికలో వెల్లడించింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే లూప్‌లైన్‌లోకి.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మారినట్లు తెలిపింది. రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌ లైన్​కు బదులుగా లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. చెన్నై వెళ్తున్న ఈ రైలును మెయిన్‌లైన్‌లోనే వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పొరపాటున ఈ రైలు లూప్‌లైన్‌లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లూప్‌లైన్‌లో ఓ గూడ్స్‌ రైలును నిలిపి ఉంచారు. దీంతో వేగంగా గూడ్స్​ రైలును ఢీకొట్టి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. అనంతరం పట్టాలు తప్పింది. దీని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ చేరుకుంది. సాయంత్రం 6.50 గంటలకు బహనగ స్టేషన్‌ దాటింది ఈ ఎక్స్‌ప్రెస్‌.. సాయంత్రం 6.52 గంటలకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఖాంతాపార స్టేషన్‌ను దాటింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ను ఢీకొట్టగానే దాని 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో కొన్ని బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో వచ్చిన బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్​.. బలంగా వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. సిగ్నలింగ్‌లో మానవ తప్పిదం కారణంగానే రైలు ప్రమాదం జరిగుండొచ్చని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు సమాచారం. దీంతో లూప్‌లైన్‌ ఉన్న గూడ్స్‌ రైలును గుర్తించినా.. వేగాన్ని నియంత్రించడం సాధ్యంకానట్లు తెలుస్తోంది. గూడ్స్‌ను ఢీకొట్టిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌.. అనంతరం దానిమీదకు దూసుకెళ్లినట్లు రైల్వే అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరగ్గానే కొన్ని బోగీలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారంటే.. 1257 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో 1039 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించాయి. అయితే వీరు కాకుండా జనరల్‌ బోగీల్లో ఎంతమంది ఎక్కారన్నది ఇంకా తెలియరాలేదు. ఎంటీ లూప్‌లైన్‌? స్టేషన్‌ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ లూప్‌లైన్లను నిర్మిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ లూప్‌లైన్ల పొడవు 750 మీటర్ల వరకు ఉంటుంది. మల్టిపుల్‌ ఇంజిన్లు ఉండే ఒక గూడ్స్‌ రైలు ఆగేందుకు వీలుగా ఈ లూప్​లైన్​లను నిర్మిస్తారు.

అయితే ప్రమాద సమయంలో కోరమాండల్​కు.. మెయిన్‌లైన్లోకి వెళ్లేందుకు సిగ్నల్‌ ఇచ్చారు. కానీ అది నేరుగా లూప్​లైన్​లోకి వెళ్లింది. నిజంగానే రైలును లూప్​లైన్​లోకి అనుమతిస్తే.. నెమ్మదిగా వెళ్లమనే సిగ్నల్​ ఇచ్చేవారు. కానీ అప్పుడు మాత్రం మెయిన్​లోకి వెళ్లమని రైలును అనుమతిచ్చినా.. అది నేరుగా లూప్​లైన్​లోకి ప్రవేశించింది. దీనిపైనే ఇప్పుడు రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :