Saturday, 13 June 2026 06:23:42 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

కేంద్ర ప్రభుత్వo నిరంకుశ వైఖిరికి నిరసనగా జనవరి 27వతేదీన అఖిల పక్ష పోరాటం,విశాఖ ఉక్కు పోరాట కమిటీ ప్రకటన.....

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విశాఖ ఉక్కు పోరాట కమిటీ న

Date : 26 December 2022 12:28 AM Views : 972

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నం విశ్వాస్ టీవీ :కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు. వచ్చే ఏడాది జనవరి 27న విశాఖపట్టణంలో లక్ష మందితో ‘ప్రజా గర్జన’ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు. ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. వచ్చే జనవరి 27న ‘ప్రజా గర్జన’ సభ నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమరవీరుల త్యాగానికి ప్రతీక అన్నారు. 32 మంది అమరవీరుల త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు చెప్పారు. కరోనా వ్యాప్తి లాంటి ప్రమాకరమైన రోజుల్లో సైతం స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారని గుర్తుచేశారు. మనకు సొంత మైన్స్ లేకపోయినా లాభాల బాటలో నడిపించారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక వనరు, దేశానికే తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ అని నేతలు వివరించారు. తమిళనాడులో ప్రతి ఏడాది ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్వహించుకునే జల్లికట్టు తరహాలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సైతం ఆదర్శంగా తీసుకుని కేంద్ర వైఖరిని వ్యతిరేకించే శక్తులు ఏకమై విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ భూములపైనే పెద్దల కన్ను: కార్మిక సంఘాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం దానికి ఉన్న భూములే అంటారు ఇక్కడి కార్మికులు. ప్లాంట్ విస్తరణ, భవనాల నిర్మాణం పోగా ఇంకా 8 వేల ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ది ఖాళీగా ఉంది. దాన్ని చేజిక్కించుకునేందుకే ప్రైవేటు కంపెనీలు స్టీల్ ప్లాంట్ పై కన్నేసాయనేది వారి వాదన. వీటి విలువ దాదాపు లక్ష కోట్ల వరకూ ఉండడంతో వాటిపై ఆధిపత్యం కోసమే ఈ కుట్ర జరుగుతుంది అంటారు వాళ్ళు. విచిత్రంగా ఇప్పుడు కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తున్న పోస్కో కంపెనీ గతంలో ఒడిశాలో ప్లాంట్ కోసం ప్రయత్నిస్తే ప్రాజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి అదే కంపెనీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా అప్పగిస్తారని కేంద్రాన్ని అడిగితే మాత్రం జవాబు లేదని ఉద్యోగ కార్మిక సంఘాలు అంటున్నాయి. జాతీయ స్థాయిలో దద్దరిల్లిన నినాదం -" ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు " వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదు. దీని ఏర్పాటు కోసం ఆంధ్రులంతా ఏకతాటిపై పోరాటం చేశారు. 1966లో గుంటూరు ప్రాంతానికి చెందిన టి.అమృతరావు విశాఖలో దీక్ష ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో దీనిలో పాల్గొన్నారు. తరగతుల బహిష్కరణ, ఆందోళనలతో నిరసనలు పెద్ద ఎత్తున సాగాయి. రాజకీయ పక్షాలు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి. 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో 9మంది మరణించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. అవి కూడా పోలీసు కాల్పులకు దారితీశాయి. ఈ కాల్పుల్లో అదిలాబాద్, వరంగల్, విజయవాడ, విజయనగరం, తగరపువలస, కాకినాడ, సీలేరు, గుంటూరులలో మొత్తం 23 మంది మరణించారు. విశాఖతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :