Tuesday, 14 April 2026 11:24:18 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఒక సారి వస్తే చాలు.. మనము కోరుకున్న-కోరికులు అన్ని జరిగి తీరుతాయి. సాక్షస్తూ శివుడు అడుగు పెట్టిన మన శ్రీశైలం

గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా, లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం.. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుందని

Date : 10 January 2024 01:08 PM Views : 1522

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ జిల్లా : గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా, లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం.. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. భువిపై వెలసిన కైలాశంగా పేరొందిన శ్రీశైలం.. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి.

మనోహరం.. శ్రీశైలం మల్లిఖార్జునుడి దర్శనం! గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా, లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం.. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసం. గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా, లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం.. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. భువిపై వెలసిన కైలాశంగా పేరొందిన శ్రీశైలం.. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. ఆదిశక్తి కొలువుదీరిన 18 శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన ప్రాంతంగానూ శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, శ్రీశైలం ‘భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి’ క్షేత్రంగా పేరొందింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఉంది. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, రెడ్డిరాజులు ఈ ఆలయాన్ని దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించారు. చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్‌ రాసిన గ్రంథంలో శ్రీశైలం ప్రసక్తి ఉంది. అప్పట్లో ఎన్నో హిందూ ఆలయాలు ముస్లిం రాజుల దాడుల్లో ధ్వంసమయ్యాయి. అయితే, శ్రీశైలంలోని ఈ ఆలయాన్ని ధ్వంసం చేయకపోగా దీన్ని అత్యంత పవిత్రధామంగా భావించడం గమనార్హం. ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో కర్నూలు జిల్లాను జాగీరుగా పొందిన దావుద్‌ ఖాన్‌ అనే సేనాని సోదరుడు ఇబ్రహీం ఖాన్‌ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం విశేషం. మల్లిఖార్జున క్షేత్రం వెలసిందిలా...: కృష్ణానది తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడనే రాజు పాలించేవాడు. సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు లేకలేక ఓ అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు బ్రహ్మగిరి నుంచి మొదలుపెట్టిన జైత్రయాత్రను రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్లపాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి, తిరిగి బ్రహ్మగిరికి చేరుకున్నాడు. అంతఃపురంలో ఓ అందమైన కన్యను చూసి చంద్రకేతుడు మనసు పారేసుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడ్డాడు. అది చూసిన అతని భార్య.. ఆమె మరెవరో కాదు, మీ కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి ‘నేను మీ కుమార్తెను. వదిలిపెట్టండి’ అని వేడుకున్నా.. చంద్రకేతుడు కామకాంక్షతో ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. దీంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటువేశాడు. శివ భక్తురాలైన చంద్రమతి మరోదారిలేక.. తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని ప్రార్థించింది. ఆమె మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడింది. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటుందని భక్తులు నమ్ముతారు.

గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి.. అక్కడో అద్భుతాన్ని చూస్తుంది. ఓ గోవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో అభిషిక్తమవుతున్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దీంతో అక్కడే ఆమె శివాలయాన్ని నిర్మించింది. స్వామివారిని నిత్యం మల్లె పూలతో అర్చించేది. ఆమె భక్తిని మెచ్చిన శివుడు.. చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన సిగలోని నెలవంక, సురగంగకు నడుమ అలంకరించుకున్నారట. అందుకే ఆ ఆలయానికి మల్లిఖార్జున స్వామి ఆలయంగా పేరొందిందని పూర్వికులు చెబుతారు.పుణ్యక్షేత్రమే కాదు.. పర్యాటక కేంద్రం కూడా: నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా, పర్యాటక స్థలంగా కూడా ఆకట్టుకుంటోంది. పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యటన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి శ్రీశైలం డ్యామ్ అందాలు వర్షాకాలంలో మరింత రమణీయంగా ఉంటాయి. శ్రీశైలానికి 3 కిమీల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. హైదరాబాద్‌‌కు 214 కి.మీ, విజయవాడకు 263 కి.మీల, కర్నూలుకు 180 కి.మీల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :