Tuesday, 14 April 2026 11:30:12 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

Andhrapradesh AAE and TA Recruitment 2023: ఏపీ దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

Date : 26 December 2023 01:21 PM Views : 1162

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఆంధప్రదేశ్‌ దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 35 ఏఈఈ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), మరో 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీకి దేవదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌ ఇండియా’ ఈ పోస్టుల నియామక ప్రక్రియను చేబడుతోంది. ఏఈఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..

ఆంధప్రదేశ్‌ దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 35 ఏఈఈ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), మరో 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీకి దేవదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌ ఇండియా’ ఈ పోస్టుల నియామక ప్రక్రియను చేబడుతోంది. ఏఈఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజనీరింగ్‌ డిప్లొమా పాసైన వారు మాత్రమే అర్హులు. రాత పరీక్ష, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరి రిజర్వేషన్‌ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష మొత్తం వంద మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత ఇంజనీరింగ్‌ అంశాలపైన ప్రశ్నలు అడుగుతారు. పది మార్కులకు ఇంగ్లిష్‌ ప్రావీణ్యం గురించి, మిగిలిన పది మార్కులకు జనరల్‌ నాలెడ్జితో కూడిన మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవదాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

దేవదాయ శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన ఆలయాల పునర్నిర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) పథకం ద్వారా రూ. 450 కోట్లకు పైగా పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అందులో రూ. 250 కోట్లకు పైగా పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లో దాదాపు రూ. 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరోపక్క టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయ శాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్రమంతటా రూ. 300 కోట్ల ఖర్చుతో 3 వేల ఆలయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరో రూ. 50 కోట్ల టీటీడీ ఆర్థిక సహాయంతో రాష్ట్రమంతటా 120కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రస్తుతం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్తగా ఇంజనీరింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నామని, నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా’కు బాధ్యతలు అప్పగించినట్లు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :