Saturday, 13 June 2026 06:15:49 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

వైఎస్ వివేకా ఇంటికి వెళ్ళన సిబిఐ అధికారులు, తనిఖీలు నిర్వహించిన CBI

Date : 24 April 2023 10:54 AM Views : 1048

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కడప జిల్లా : వివేకా హత్య కేసులో కీలక పురోగతిని సాధించింది సీబీఐ.. మరోసారి పులివెందులలో తనిఖీలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో.. సీన్ రీకన్స్ట్రక్షన్‌ చేయడంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ సుప్రీం కోర్టులో ఏం జరగబోతుందోనని తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. వివేకా కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పులివెందులలో వివేకా ఇంటిని సీబీఐ బృందం మరోసారి పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ బృందం అధికారులు పులివెందులలో వివేకా ఇంటి పరిసరాలను చూశారు. ఇంట్లో హత్య జరిగిన బాత్రూం, బెడ్ రూమ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి నుంచి బయటికి వచ్చిన సీబీఐ అధికారులు సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి పరిసరాలనూ పరిశీలించారు. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు. తిరిగి మళ్లీ వివేకా ఇంటికి ఇచ్చి సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి వద్ద టైపిస్టుగా పని చేసిన ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో ఇనయతుల్లా కీలకమైన వ్యక్తిగా సీబీఐ భావిస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఇనయతుల్లా కుటుంబ సభ్యులకు పంపించారు. దీంతో హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. ఎంతసేపులో వివేకా ఇంటికి అవినాష్‌ వచ్చారని ఆరా.. హత్య జరిగిన రోజు వైఎస్ అవినాష్‌రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చు అనేదానిపై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు.. మరోసారి క్షుణ్నంగా తనిఖీ చేయడానికే పులివెందుల వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ అధికారులు తాజాగా వివేకా ఇంటిని, అవినాష్‌రెడ్డి ఇంటిని పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గత శుక్రవారం సునీత పిటిషన్ విచారించింది సీజేఐ ధర్మాసనం. అవినాష్ రెడ్డి కి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పై కీలక ఆదేశాలిచ్చింది ధర్మాసనం. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందని చెప్పారు అవినాశ్ తరఫు న్యాయవాది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ ని ఆదేశించింది ధర్మాసనం. సోమవారం ఏం జరుగుతుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :